మేడారం మహాజాతర నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేడారం పర్యటన సందర్భంగా సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో కలిసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.

ఈ దర్శన కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖసంతోషాలు, సమృద్ధి కలగాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు తెలిపారు.
మేడారం జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టినట్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం వైద్య, భద్రత, తాగునీరు, రవాణా వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.


