HomeWarangal Newsఆగ్రంపహాడ్‌లో నూతన అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఆగ్రంపహాడ్‌లో నూతన అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Published on

spot_img

ఆగ్రంపహాడ్‌లో నూతన అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి:

ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్‌ గ్రామంలో మహిళా శక్తి వారోత్సవాల సందర్భంగా నూతన అంగన్వాడీ భవనాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ..”చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీ కేంద్రాలు బలమైన పునాది లాంటివని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణతో పాటు చిన్నారులకు పోషకాహారం ప్రాథమిక విద్య అందించడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు”.

రాష్ట్ర ప్రభుత్వం, విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని త్వరలోనే ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్” ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అంగన్వాడి సిబ్బందికి డైట్ చార్జీలు పెంచిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మహిళల సాధికారత, పిల్లల ఆరోగ్య అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో విద్య, వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఆయన అన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles