మేడారం జాతర పరిసర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంగళవారం శాసనమండలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా మేడారం జాతర ప్రాముఖ్యతను గుర్తించి, చరిత్రలో నిలిచిపోయేలా అక్కడే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించామని గుర్తు చేశారు.
ఈ ఏడాది జరిగిన మహా జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల నుండి సుమారు రెండు కోట్ల మంది భక్తులు హాజరయ్యారని ఆయన వివరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, భవిష్యత్తులో మేడారాన్ని మరింత ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.


