HomeWarangal NewsMNREGA పథకాన్ని బలహీనపరిచే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు..

MNREGA పథకాన్ని బలహీనపరిచే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు..

Published on

spot_img

వరంగల్ / పర్వతగిరి మండలం..
25 జనవరి 2026…

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA) పేరు మార్పుకు వ్యతిరేకంగా AICC & TPCC పిలుపు మేరకు, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారి అధ్యక్షతన పర్వతగిరి మండల పరిధిలోని చౌటపల్లి గ్రామంలో మండల పరిధిలోని ఉపాధి హామీ కూలీలతో గ్రామ సభ నిర్వహించబడింది.

ఈ సభలో గ్రామ ప్రజలతో కలిసి MNREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరుతూ తీర్మానాలు చేసి, ఆ తీర్మాన పత్రాలను వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహమ్మద్ అయూబ్ గారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ..

కేంద్ర ప్రభుత్వం కుట్రపూర్వకంగా MNREGA పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా పేరు మార్పు చేపట్టిందని ఆరోపించారు.

ఇది గ్రామీణ కూలీల ఉపాధి హక్కును హరించే చర్య అని విమర్శించారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు….

ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం సిగ్గుచేటు చర్య అని తీవ్రంగా ఖండించారు.

ఉపాధి హామీ కూలీలకు పూర్తిస్థాయి పని దినాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, వెంటనే పథకం పేరు మార్పు నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే ప్రజలకు ఉపాధి హక్కును, గ్రామ పంచాయతీలకు పాలనా హక్కులను తిరిగి కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు…

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అయూబ్ గారు మాట్లాడుతూ…

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MNREGA) దేశంలోని పేదలు, గ్రామీణ కూలీల జీవనాధారంగా నిలిచిన చట్టమని అన్నారు.

కోట్లాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ చట్టాన్ని బలహీనపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేరు మార్పు వంటి చర్యలకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు.

గాంధీజీ పేరుతో రూపొందిన ఈ చట్టం గ్రామీణ భారతానికి భరోసా కల్పించిందని, ఆ పేరును తొలగించే ప్రయత్నం ప్రజల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.

ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 100 రోజులకు పైగా పని దినాలు కల్పించాల్సిన అవసరం ఉందని, బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

గ్రామ పంచాయతీలకు ఉన్న అధికారాలను కుదించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ, MNREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించి, మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీ మట్టపల్లి వెంకటేశ్వర రావు, మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల గ్రామ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఉపాధి హామీ కూలీలతో పాటు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles