ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.
అదే IPL కి సంబందించినది. ఐపిఎల్ లో మంగళవారం రాత్రి లక్నో సూపర్ జాయింట్స్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది.
అయితే ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ విన్ అయింది. ఈ మ్యాచ్ ఒక అద్భుతమైన రికార్డుతో పాటు ఐపీఎల్ చరిత్రలోనే నవ్వులు కూడా పూయించింది.

దాని కారణం ఒకే ఒక్కడు. ఒక కామెడీ రన్ అవుట్ మిస్ కు కూడా సాక్ష్యంగా నిలిచింది.
లక్నో బౌలర్ మొహసిన్ ఖాన్ చేసిన ఈ ఘోర తప్పిదం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
వికెట్ల పక్కనే ఉండి కూడా మొహసిన్ ఖాన్ రన్ అవుట్ చేయలేకపోవడంతో స్టేడియంలోని వారంతా నొరెళ్లపెట్టేశారు.
ఈ ఫన్నీ ఇన్సిడెంట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

రాజస్థాన్ ఇన్నింగ్స్ లో 14 ఓవర్ అది. మొదటి బంతి అయిపోగానే స్టేడియంలో నవ్వులు పూసాయి.
ధ్రువ్ జురెల్ ఆడిన షాట్ ను లక్నో ఫిల్టర్ దిగ్విష్ రాఠి అద్భుతంగా ఆపి వెంటనే నాన్ స్ట్రైకర్ అండ్ బౌలర్ మోహిన్ ఖాన్ కు బంతిని విసిరాడు.
అయితే అప్పటికే గ్రీజు వదిలి సగం దూరం వచ్చిన వైభవ్ సూర్యవంశీ వెనక్కి వెళ్లే అవకాశం కూడా లేకపోయింది.
ఆశలు కూడా వదిలేసుకున్నాడు. అయితే మొహసిన్ ఖాన్ వికెట్ల ముందే నిలబడి ఉన్నాడు.
కేవలం బంతితో వికెట్లను తాకిస్తే చాలు రన్ అవుట్ అయిపోయేది.
వికెట్ పడిపోయేది. కానీ, అతగాడి మైండ్ బ్లాక్ అయింది. వికెట్లను నేరుగా తాకించకుండా పక్కనే ఉండి వికెట్ల పైకి బంతిని గాల్లోకి విసిరాడు.
ఆశ్చర్యకరంగా ఆ బంతి వికెట్లకి తగలకుండా పక్క నుంచి వెళ్ళిపోయింది. దీంతో వైభవ్ సేఫ్ అయ్యాడు.
వైభవ్ నవ్వుకుంటూ చాలా ఈజీగా గ్రీజులోకి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.


