జనగామ: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు. జనగామ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘దిశా’ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వివిధ కేంద్ర పథకాల అమలకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. ఎంపీ లాడ్స్ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులను ప్రారంభించడంలో నిర్లక్ష్యం వహించవద్దని, మంజూరైన మూడు నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే వాటిని రద్దు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అలాగే నిధుల వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత పాటిస్తూ, సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


