HomeWarangal Newsఅభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: అధికారులకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య హెచ్చరిక

అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు: అధికారులకు ఎంపీ డాక్టర్ కడియం కావ్య హెచ్చరిక

Published on

spot_img

ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా ‘దిశా’ కమిటీ కో-చైర్‌పర్సన్ డాక్టర్ కడియం కావ్య ఆదేశించారు. గురువారం వరంగల్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశంలో ఆమె పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.

వ్యవసాయ రంగంపై ఎంపీ ప్రత్యేక దృష్టి:

వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్న ఎంపీ, రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఫలితాలను చూపాలని అన్నారు.

 ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు కనీసం రెండు నెలల పాటు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఎరువులు, విత్తనాల లభ్యతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.

 సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ కల్పించడం ద్వారా రైతులకు లాభసాటిగా మార్చాలని చెప్పారు.

నష్టనివారణ కోసం 60 నుండి 70 శాతం మంది రైతులు అంతర పంటల సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రోత్సహించాలని తెలిపారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి:

గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల్లో కేవలం 20 శాతం మాత్రమే పురోగతి ఉండటంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియలో అనవసర జాప్యం తగ్గించి, అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

 వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, అందుకు అనుగుణంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత:

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు (Enrolment) పెంచి, డ్రాపౌట్స్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కె.ఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్లు జి. సంధ్యారాణి, వై.వి. గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles