HomeWarangal Newsవరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్రం పచ్చజెండా: ఎంపీ కడియం కావ్య పట్టుదలకు దక్కిన ఫలితం

వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌కు కేంద్రం పచ్చజెండా: ఎంపీ కడియం కావ్య పట్టుదలకు దక్కిన ఫలితం

Published on

spot_img

హన్మకొండ: వరంగల్ అభివృద్ధి విషయంలో తనదైన ముద్ర వేస్తున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మరో విజయాన్ని అందుకున్నారు. వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (KMTP) పనులను వేగవంతం చేయడంలో ఆమె చేసిన కృషి ఫలించింది.

​ఇటీవల లోక్‌సభలో రూల్ 377 కింద వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ అంశాన్ని కడియం కావ్య ప్రస్తావించారు. ‘ప్రధాని మిత్ర’ పథకం కింద ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలని, పార్క్ త్వరితగతిన ప్రారంభం కావడానికి అవసరమైన ఆర్థిక మరియు మౌలిక వసతుల మద్దతును పెంచాలని ఆమె కేంద్రాన్ని బలంగా కోరారు.

​ఎంపీ కడియం కావ్య వినతిపై కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. 

ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటనలు చేశారు:

ఇప్పటికే తొలి విడతగా రూ. 30 కోట్ల నిధులు విడుదలయ్యాయని, తదుపరి విడత నిధులు అర్హతల ప్రకారం విడుదల చేస్తామని తెలిపారు.

పరిశ్రమలను ఆకర్షించేందుకు రూ. 300 కోట్ల వరకు ఆకర్షణాత్మక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.

​ పీఎల్ఐ (PLI), సమర్థ్ వంటి పథకాల ద్వారా కూడా ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లు లబ్ధి పొందవచ్చని సూచించారు.

పెరగనున్న ఉపాధి అవకాశాలు:

​రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఈ మెగా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఎంపీ కడియం కావ్య నిరంతర అనుసరణ (Follow-up) కారణంగా ఈ ప్రాజెక్టులో కదలిక రావడంతో వరంగల్ వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ పార్క్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వరంగల్ ప్రాంతంలో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు, భారీగా పెట్టుబడులు రానున్నాయి

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles