HomeWarangal Newsప్రజాసేవే పరమావధి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

ప్రజాసేవే పరమావధి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

Published on

spot_img

వరంగల్ మహానగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజల మధ్య ఉంటేనే నిజమైన ప్రజాసేవ సాధ్యమవుతుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కౌన్సిల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

“పదవులు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ మనం చేసే మంచి పనులు, సంపాదించుకున్న మంచి పేరు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయి” అని ఎంపీ వ్యాఖ్యానించారు.

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని, ఇందుకోసం నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విడుదల చేయించారని పేర్కొన్నారు.

వరంగల్ ఎయిర్‌పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. చారిత్రక వేయి స్తంభాల ఆలయ అభివృద్ధి కోసం రూ. 14 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు.

​ప్రతి డివిజన్‌లోని సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. శానిటేషన్, తాగునీరు వంటి కనీస అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

“రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన హక్కుల నిధుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. నగరాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.”— డాక్టర్ కడియం కావ్య, ఎంపీ

ఈ సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ & GWMC ఇంచార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, మరియు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles