HomeLatest Newsపరకాల అభివృద్ధికి ఎంపీ కడియం కావ్య పిలుపు: 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' సమీక్ష

పరకాల అభివృద్ధికి ఎంపీ కడియం కావ్య పిలుపు: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ సమీక్ష

Published on

spot_img

పరకాల నియోజకవర్గ స్థాయి ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.

​ ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని ఎంపీ తెలిపారు. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, ధాన్యపు కేంద్రాల నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ భారీగా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,600 ఇళ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రూ. 500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు విజయవంతంగా అందుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలని, హెల్త్ సబ్-సెంటర్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించాలని సూచించారు.

​ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపామని, త్వరలోనే మరిన్ని నిధులు విడుదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పరకాలలో డైరీ ప్రాజెక్టు ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

​ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తోందని, నిత్యావసర ధరల నియంత్రణలో విఫలమైందని విమర్శించారు.

​ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ZP CEO శేషాద్రి, DRDO శ్రీనివాస్, NPDCL SE మధుసుదన్, RDO నారాయణతో పాటు మున్సిపల్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, మండల స్థాయి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యమని, ప్రతి పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

వినాయకుడికే తొలి పూజ ఎందుకు? హిందూ సంప్రదాయంలోని అసలు రహస్యం!

ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే వినాయకుడినే మొదట పూజించడానికి ఉన్న ఆధ్యాత్మిక, పౌరాణిక కారణాలు ఏమిటి? విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా గణపతికి ఈ ప్రత్యేక స్థానం ఎలా లభించిందో తెలుసుకుందాం.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు: రూ. 2 లక్షల ఉచిత బీమా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల సంక్షేమం దృష్ట్యా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 2 లక్షల ఆరోగ్య/జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.