HomeWarangal Newsమెగా జాబ్ మేళాలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

మెగా జాబ్ మేళాలో పాల్గొన్న వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

spot_img

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ కడియం కావ్య

హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో రాష్ట్ర పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన 72 ప్రముఖ కంపెనీల స్టాల్స్‌ను ఎంపీ సందర్శించి అభ్యర్థులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు.

జాబ్ మేళా

సమావేశంలో మాట్లాడిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో సవాళ్లు పెరుగుతున్నప్పటికీ యువత నిరాశ చెందకుండా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

“నిత్య విద్యార్థిగా ఉంటేనే జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది. రాయిని పదును పెడితేనే డైమండ్ అవుతుంది” అంటూ యువతలో ఆత్మవిశ్వాసం నింపారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపకూడదన్నారు.

మంత్రి కొండ సురేఖ గారు

ఫిజికల్ హెల్త్‌తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్న ఎంపీ.. ప్రతిరోజూ మెడిటేషన్, పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. “ప్రపంచంతో యుద్ధం చేస్తే అలెగ్జాండర్.. నీతో నువ్వు యుద్ధం చేస్తే బుద్ధుడు” అంటూ యువతకు ప్రత్యేక సందేశం ఇచ్చారు.

కాళోజీ కళాక్షేత్రం

ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్టార్టప్స్, వ్యాపారాలు, ప్రైవేట్ రంగ అవకాశాల వైపు కూడా యువత దృష్టి సారించాలని ఎంపీ కడియం కావ్య సూచించారు. ఒక అవకాశం కోల్పోయినా మరో అవకాశం కోసం ప్రయత్నించే ధైర్యం ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...