వరంగల్ ఎంపీ కడియం కావ్యా లోకసభలో వరంగల్ జిల్లాలోని ఐటీఐలు మరియు ఎన్‌ఎస్‌టీఐల పనితీరు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 301 ఐటీఐలు ఉండగా, కేవలం వరంగల్ జిల్లాలోనే 30 ఐటీఐలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత మూడేళ్లలో వరంగల్ జిల్లాలో మొత్తం 11,754 మంది అభ్యర్థులకు ఈ సంస్థల ద్వారా శిక్షణ అందినట్లు కేంద్రం తెలిపింది. అయితే, వరంగల్‌లో కొత్తగా ఐటీఐలు లేదా ఎన్‌ఎస్‌టీఐలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలేవీ ప్రస్తుతం పరిశీలనలో లేవని కేంద్రం స్పష్టం చేసింది.
యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను (Modern Skills) అందించేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో మరిన్ని వసతులు కల్పించాలని ఎంపీ డిమాండ్ చేశారు.


