HomeWarangal Newsలంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన MRO సుచరిత..!

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన MRO సుచరిత..!

Published on

spot_img

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన MRO సుచరిత:

శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మార్వో సుచరితను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆలియాబాద్ పరిధిలోని సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్ (Convertion) కోసం ఎకరాకు రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 30 లక్షలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగంగా అడ్వాన్స్ గా రెండు లక్షలు ఎమ్మార్వో కార్ డ్రైవర్ తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఆ నగదును డ్రైవర్ నుంచి సుచరితకు అందజేస్తున్న సమయంలో ఏసీబీ బృందం అకస్మికంగా దాడులు నిర్వహించింది. డబ్బు గురించి ప్రశ్నించగా ఎమ్మార్వో సుచరిత ఆమె డ్రైవర్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. శామీర్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయం అవినీతికి కేంద్రంగా మారింది అన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏసీబీ అధికారులు కార్యాలయంలో సోదాలు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ACB అధికారులు పేర్కొన్నారు

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...

కేంద్ర పథకాలు వేగంగా అమలు చేయాలి: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధికారులను ఆదేశించారు.
spot_img

Related Articles