ములుగు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కర్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడిన లేగదూడను రక్షించేందుకు వెళ్లిన తండ్రి, అతని ఇద్దరు కుమారులు బావిలో పడి మృతి చెందారు.
స్థానికుల సమాచారం మేరకు, లేగదూడ బావిలో పడిపోవడంతో దాన్ని బయటకు తీయడానికి తండ్రి ముందుగా బావిలోకి దిగాడు. అనంతరం సహాయం చేయడానికి దిగిన ఇద్దరు కుమారులు ఈత రాకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. ముగ్గురూ బావిలోనే మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.


