ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల సిద్ధమైంది. గతంలో ఇక్కడి గుత్తికోయల పిల్లలు సరైన వసతులు లేక పశువుల కొట్టంలోనే విద్యనభ్యసించేవారు. ఈ దుస్థితిపై వరుస కథనాలు ప్రచురించబడ్డాయి.
ఈ కథనాలకు స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కంటైనర్ పాఠశాలలను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం ఈ కంటైనర్ పాఠశాల సిద్ధంగా ఉంది. త్వరలోనే మంత్రి సీతక్క చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది.
గంటలకుంట మరియు మామిడిగూడెం గ్రామాల నుండి సుమారు 36 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించనున్నారు.


