ములుగు జిల్లా:
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఓ గ్రామంలో బాలికపై సర్పంచ్ భర్త అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానిక ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు భయం చెప్పాలని కుటుంబ సభ్యులు గ్రామ పెద్దగా ఉన్న శ్రీకాంత్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో మధ్యాహ్న సమయంలో బాలిక ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ ఆమెపై లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తోంది.
అయితే బాలిక ప్రతిఘటించి అక్కడి నుంచి బయటకు వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


