HomeWarangal Newsకౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు

కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు

Published on

spot_img

జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట ప్రాంతాల్లో రేపు కౌంటింగ్

హనుమకొండ:

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా శాంతి భద్రతల దృష్ట్యా కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ తెలిపారు.

జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట ప్రాంతాల్లో రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బి.ఎన్.ఎస్. ఎస్ సి.ఆర్.పి.సి సెక్షన్ 163 ప్రకారం ఐదుగురికి మించిన వ్యక్తులు గుంపులుగా చేరడాన్ని నిషేధించారు.

ఈ ఆదేశాలు రేపు ఉదయం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

పౌరులు పోలీసు శాఖకు సహకరించి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles