HomeWarangal Newsప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముప్పారం గ్రామంలో వినూత్న నిర్ణయం..!

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముప్పారం గ్రామంలో వినూత్న నిర్ణయం..!

Published on

spot_img

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముప్పారం గ్రామంలో వినూత్న నిర్ణయం :

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు లక్ష్యంగా వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. ముప్పారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలు తగ్గుతున్న నేపథ్యంలో సర్పంచ్ గుంటిపల్లి రేణుక ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ప్రత్యేక తీర్మానం చేసింది.

ఈ తీర్మానం ప్రకారం గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రోత్సహించే చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థులకు షూలు, బెల్టులు వంటి అవసరమైన వస్తువులను అందజేస్తామని గ్రామపంచాయతీ హామీ ఇచ్చింది. అలాగే గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ అడ్మిషన్ల కోసం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నారు.

అంతేకాకుండా గ్రామ వార్డు సభ్యులకు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఏ వార్డు సభ్యుడైనా కనీసం 11 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలను పెంచేందుకు మరో కీలక ప్రతిపాదనను కూడా గ్రామపంచాయతీ ముందుకు తెచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన కుటుంబాలకు ఇంటి పన్ను, నీటి పన్నుల్లో రాయితీలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు గ్రామపంచాయతీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముప్పారం గ్రామం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Latest articles

SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ ఊరట.. ఏజ్ లిమిట్ పెంపు!

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు తత్సమాన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఎంత దూరంలో పెట్టాలి? నిపుణుల సూచనలు !

నిద్రపోయే సమయంలో ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడటంతో పాటు స్క్రీన్ టైమ్ తగ్గుతుంది. ఫోన్‌ను దూరంగా ఉంచడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ముంబై ఎక్స్‌పోలో పాల్గొన్న జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణ పరిజ్ఞాన ప్రదర్శన 'IFAT India 2026' సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.
spot_img

Related Articles

ఇసుక ట్రాక్టర్ – ఆటో ఢీ: ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

హనుమకొండలో భారీ అగ్నిప్రమాదం: హోటల్ యజమాని దుర్మరణం, భార్య పరిస్థితి విషమం

హనుమకొండ జిల్లా పరిధిలోని అదాలత్ జంక్షన్ వద్ద ఉన్న ప్రముఖ 'లింగాల కేదారి హోటల్'లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వేయి స్తంభాల గుడిలో ‘ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి’ ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి.