వరంగల్ జిల్లాలో అనుమానస్పద మృతి ఘటన కలకలం రేపింది. నక్కలపల్లి ప్రాంతంలోని ఓ తౌడ్ మిల్లులో పనిచేస్తున్న కార్మికుడు అనుమానస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం.
అయితే మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియక ముందే హడావిడిగా మృతదేహాన్ని ఆంబులెన్స్ లో జార్ఖండ్ కు తరలించేశారు. పోస్టుమార్టం నిర్వహించకుండా మృతదేహాన్ని తరలించడం వివాదాస్పదంగా మారింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనపై అనుమానాలు వ్యక్తం అవడంతో మామునూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు జార్ఖండ్ కు చెందిన వలస కార్మికుడిగా తెలుస్తుంది.
పోలీసులు.. మిల్లు యాజమాన్యంని, అక్కడ పనిచేస్తున్న ఇతర కార్మికులను విచారిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పోస్టుమార్టం లేకుండానే మృతదేహాన్ని తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


