హనుమకొండ: హనుమకొండలోని వికాస్ నగర్‌లో నిర్వహించిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ దక్షిణ గోపుర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా పూర్తై భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నైనీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయం అభివృద్ధి చెందుతూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు.


