యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమా నందన అలియాస్ నందు ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ‘నందూస్ వరల్డ్’ అనే యూట్యూబ్ ఛానల్‌తో ఆమెకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే యూకే వీసాలు, స్పాన్సర్‌షిప్ పేరుతో మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆమె పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
యూకే వీసాల పేరుతో మోసం చేశారనే ఆరోపణలు :
యూకేలో స్పాన్సర్‌షిప్ వీసాలు ఇప్పిస్తామంటూ పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు నందుపై ఉన్నాయి. ఈ వ్యవహారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమెను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను నందు ఖండిస్తూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వస్తున్న ప్రచారంలో మీడియా పాత్ర ఉందని గట్టిగా మాట్లాడింది.
బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీపై చర్చ :
ఇదిలా ఉంటే నందు ఇండియాకు రావడానికి మరో కారణం ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆమె హౌస్‌లోకి వెళ్లబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.
నాగార్జునకు సంధ్యారెడ్డి వార్నింగ్ :
నందు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారంపై కాంగ్రెస్ నాయకురాలు సంధ్యారెడ్డి స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని రియాలిటీ షోలోకి ఎలా తీసుకొస్తారని..? ఆమె ప్రశ్నించారు. నందును షోలోకి తీసుకుంటే బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు హోస్ట్ నాగార్జున కూడా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ :
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్న నందుకు బిగ్ బాస్‌లో అవకాశం ఇవ్వకూడదని అంటుండగా.. మరికొందరు ఆమెపై ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదని, షోలోకి వస్తే ఆమెకు మద్దతు ఇస్తామని చెబుతున్నారు. దీంతో నందు బిగ్ బాస్ ఎంట్రీ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


