HomeLatest Newsనేపాల్‌లో అమానుష ఘటన.. మహిళ శవం మీద ఉన్న బంగారం దోపిడీ..!

నేపాల్‌లో అమానుష ఘటన.. మహిళ శవం మీద ఉన్న బంగారం దోపిడీ..!

Published on

spot_img

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరి ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

మృతదేహం వద్ద దారుణ చర్య :

ఈ విపత్కర పరిస్థితుల్లో మానవత్వాన్ని ప్రశ్నించేలా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. వరద నీటిలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహం చెట్లు, రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మృతదేహం వద్దకు వెళ్లారు. వారిలో ఒకరు కర్ర సాయంతో శవాన్ని బయటకు లాగగా.. మరో వ్యక్తి మహిళ జుట్టు పట్టుకుని ఆమె చెవికి ఉన్న బంగారు కమ్మలను తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

వీడియోపై తీవ్ర ఆగ్రహం:

ఈ దృశ్యాలను అక్కడున్న కొందరు చూస్తున్నప్పటికీ వారిని ఎవరూ అడ్డుకోకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపత్తు సమయంలోనూ మృతదేహాన్ని గౌరవించకుండా దోపిడీకి పాల్పడటం అమానుషమని మండిపడుతున్నారు. కొందరు కలియుగం అంతరించిపోవడానికి దగ్గరపడ్డింది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు.

భారతీయ పర్యాటకులూ గల్లంతు:

నేపాల్‌లోని పర్యాటక ప్రాంతాల్లోనూ వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ విపత్తులో పలువురు విదేశీ పర్యాటకులు గల్లంతైనట్లు సమాచారం. వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఒకవైపు ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు పోరాడుతుంటే.. మరోవైపు మృతుల పట్ల ఇలాంటి అమానవీయ ప్రవర్తన జరగడం కలచివేస్తోంది.

Clik Here For Video https://www.instagram.com/reel/DcidAKytXp0/

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.