ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త ప్రయత్నం.. ‘డయల్ యువర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే’ :
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరీక్షించేందుకు Way2SMS సంస్థ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డయల్ యువర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి తెలియజేసే అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమం మే 29వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు వంటి సమస్యలపై ప్రజలు 7331115531 నెంబర్ కి ఫోన్ చేసి ఎమ్మెల్యేతో ప్రత్యక్షంగా మాట్లాడవచ్చు.
ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అయితే ప్రజలు గమనించవలసిన విషయం ఏంటంటే.. నిర్ణయించిన తేదీ మరియు సమయాలలో మాత్రమే కాల్స్ స్వీకరించబడతాయి. ఈ అవకాశాన్ని వరంగల్ పశ్చిమ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.


