HomeWarangal NewsNHM ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: వినోద్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్

NHM ఉద్యోగుల సమ్మెకు సంపూర్ణ మద్దతు: వినోద్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్

Published on

spot_img

తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM)లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నెల 13వ తేదీ నుంచి చేపట్టనున్న సమ్మెకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.

NHMలో సుమారు 17 వేల మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తూ రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఇతర కాంట్రాక్ట్ సిబ్బంది ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

ప్రస్తుతం NHM ఉద్యోగులు పొందుతున్న గ్రాస్ జీతాలను పెంచడంతో పాటు తగిన ఇన్‌క్రిమెంట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను వెంటనే కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగినా, అనారోగ్యానికి గురైనా లేదా ఉద్యోగి మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న NHM డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.

నేషనల్ హెల్త్ మిషన్ కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమమని, ఇతర రాష్ట్రాల్లో NHM ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలించాలని సూచించారు.

ఇన్నేళ్లుగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో సేవలందిస్తున్న ఉద్యోగులను కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించడం సరికాదని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని వినయ్ భాస్కర్ అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే NHM ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వారి ప్రతినిధులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

జీతాల పెంపు, ఇన్‌క్రిమెంట్లు, ఇన్సూరెన్స్, ఉద్యోగ భద్రత, రెగ్యులరైజేషన్ వంటి డిమాండ్ల సాధన కోసం NHM ఉద్యోగులు చేపడుతున్న సమ్మెకు తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జేఏసీ ప్రెసిడెంట్ డా. మహేందర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డా. భరత్, జనరల్ సెక్రటరీ ఎండీ రుకముద్దీన్, కార్యవర్గ సభ్యులు నరేష్, వినోద్ తదితరులు వినతిపత్రం అందజేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles