HomeWarangal Institutions"జోసా" కౌన్సెలింగ్‌పై అవగాహన కోసం వరంగల్ ఎన్‌ఐటీ ‘ఓపెన్ హౌస్’..!

“జోసా” కౌన్సెలింగ్‌పై అవగాహన కోసం వరంగల్ ఎన్‌ఐటీ ‘ఓపెన్ హౌస్’..!

Published on

spot_img

“జోసా” కౌన్సెలింగ్‌పై అవగాహన కోసం వరంగల్ ఎన్‌ఐటీ ‘ఓపెన్ హౌస్’ :

హనుమకొండ: దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే “జాయింట్ అలోకేషన్ అథారిటీ (జోసా)” 2026 కౌన్సిలింగ్ ప్రక్రియపై విద్యార్థులు , తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వరంగల్ ఎన్‌ఐటీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు “ఎన్ఐటి” క్యాంపస్ లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో “ఓపెన్ హౌస్” కార్యక్రమం జరగనుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు, తల్లిదండ్రులకు సంస్థలో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు, మౌలిక సదుపాయాలు, పరిశోధన మరియు ఆవిష్కరణ కార్యక్రమాలు, ప్లేస్‌మెంట్ అవకాశాలు, విద్యార్థి సహాయక సేవలు, క్యాంపస్ జీవన విధానం వంటి అంశాలపై సమగ్ర సమాచారం అందించనున్నారు. తద్వారా ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయాలను సరైన సమాచారంతో తీసుకునే అవకాశం లభించనుంది.

వరంగల్ ఎన్‌ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధితో పాటు డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు. జోసా కౌన్సిలింగ్లో శాఖల ఎంపిక, సీట్ల కేటాయింపు విధానం, విద్యా కార్యక్రమాలు, హాస్టల్ సదుపాయాలు, క్యాంపస్ లోని ఇతర అవకాశాలపై సందేహాలను నేరుగా నివృత్తి చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

అలాగే ప్రస్తుతం ఎన్ఐటీలో చదువుతున్న విద్యార్థులతో ప్రత్యక్షకంగా మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా హాజరు కాలేని విద్యార్థులు తల్లిదండ్రుల కోసం కార్యక్రమాన్ని వరంగల్ ఎన్ఐటి అధికార యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు . లైవ్ స్ట్రీమింగ్ లింక్: https://youtube.com/live/HsrZFv7N1m?feature=share. జోసా కౌన్సిలింగ్ కి సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది అని నిర్వాహకులు తెలిపారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

తెలంగాణలో MBBS, BDS ఫీజులు (2026-29) ఇవే.. KNRUHS కీలక అప్‌డేట్..!

తెలంగాణలో MBBS, BDS ఫీజులు (2026-29) ఇవే.. KNRUHS కీలక అప్‌డేట్..!:తెలంగాణలో 2026-29 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ మెడికల్,...

NIT Warangalలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు.. అర్హతలు ఇవే..!

NIT Warangalలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్ వంటి విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.