HomeWarangal Newsహనుమకొండ | నియోజకవర్గ స్థాయి సీఎం కప్ ప్రారంభం..

హనుమకొండ | నియోజకవర్గ స్థాయి సీఎం కప్ ప్రారంభం..

Published on

spot_img

తేదీ :04/02/2026- బుధవారం, JNS స్టేడియం, హనుమకొండ.

హనుమకొండలోని JNS స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సీఎం కప్ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్య, వైద్యం, వ్యవసాయం తరువాత అత్యధిక ప్రాధాన్యత క్రీడలకే కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ క్రీడా కార్యక్రమాలు నిర్వహించినా క్రీడా శాఖ మంత్రి, సార్క్ చైర్మన్‌లను పంపిస్తూ క్రీడాకులను మరింత ఉత్సాహపరుస్తున్నారని పేర్కొన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక క్రీడాకారుడు కావడం వలన క్రీడలను బలోపేతం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. క్రీడలు కేవలం వినోదం లేదా వ్యాయామానికి మాత్రమే పరిమితం కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు దారి తీస్తాయని ఎమ్మెల్యే తెలిపారు.

వరంగల్ జిల్లాకు చెందిన చెస్ క్రీడాకారుడు ప్రతిభ చాటిన సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రోత్సాహకం అందించారన్న ఉదాహరణను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

CM Cup

ఇది ప్రభుత్వం క్రీడాకులకు ఎంత ప్రాధాన్యత ఇస్తోందనడానికి నిదర్శనమని అన్నారు. సీఎం కప్ కార్యక్రమాన్ని ఐదు అంచెలుగా నిర్వహిస్తూ గ్రామీణ క్రీడాకులను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

గ్రామ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు క్రీడాకులు తమ ప్రతిభను ప్రదర్శించేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని చెప్పారు.

ఈ వేదిక ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందే క్రీడాకులను తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం కప్‌ను నిర్వహిస్తోందన్నారు.

Naini Rajender Reddy

గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడా శాఖను బలోపేతం చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సాహకాలు కల్పిస్తూ యువతను క్రీడల వైపు ఆకర్షిస్తున్నట్లు చెప్పారు.

సీఎం కప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి అశోక్, స్పెషల్ ఆఫీసర్ నంద కిషోర్ గౌడ్, అసోసియేషన్ మెంబర్లు సృజన్, కార్తీక్, రాజు, ఇతర అధికారులు, కోచ్‌లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...