HomeLatest Newsహైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

హైదరాబాద్ ORRపై ఘోర ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

Published on

spot_img

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట నుంచి స్వర్ణగిరి దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న ఒక కారు, నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

​యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ వస్తున్న కారు (TS 23F 2298), 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొట్టింది. వేగం ధాటికి కారు సగభాగం లారీ కిందకు దూసుకువెళ్లి పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తుండగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

​మృతులు సిరిసిల్లకు చెందిన వారుగా గుర్తించారు. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో నివసిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం అత్యంత బాధాకరం.

శ్రీనివాస్, శివ, లాస్య, మాధవ్, కృష్ణచంద్ర, రిషిక. శ్వేత అనే మహిళకు తీవ్ర గాయాలవ్వగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

మృతులంతా ఆలయంలో తీసుకున్న చివరి ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దైవదర్శనం చేసుకుని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుండగా, ఇంతలోనే మృత్యువు కబళించడం అందరినీ కలిచివేస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Latest articles

ఐఫోన్‌లో కొత్త శకం.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది!

యాపిల్ ఎట్టకేలకు ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. కొత్త డిజైన్, ఫోల్డింగ్ డిస్‌ప్లే, అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఐఫోన్‌పై టెక్ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

నందు బిగ్ బాస్‌లోకి వస్తే..నాగార్జునకు కొత్త తలనొప్పి తప్పదా?

బిగ్ బాస్ తెలుగు 10లో నందు ఎంట్రీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నందు హౌస్‌లోకి వస్తే హోస్ట్ నాగార్జునకు కొత్త తలనొప్పులు తప్పవా? ఆమెకు సంబంధించిన వివాదాలు షోపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హనుమకొండలో తీవ్ర విషాదం: అగ్నిప్రమాదంలో హోటల్ యజమాని భార్య మృతి

హనుమకొండలోని అదాలత్ కూడలిలో నిన్న (బుధవారం) రాత్రి సంభవించిన అగ్నిప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో హోటల్ యజమాని లింగాల కేదారి నిన్న రాత్రే దుర్మరణం చెందగా, తీవ్రంగా గాయపడిన ఆయన భార్య పుష్పలత (52) ఈరోజు (గురువారం) చికిత్స పొందుతూ కన్నుమూశారు.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.
spot_img

Related Articles

వినాయకుడికే తొలి పూజ ఎందుకు? హిందూ సంప్రదాయంలోని అసలు రహస్యం!

ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తోంది. అయితే వినాయకుడినే మొదట పూజించడానికి ఉన్న ఆధ్యాత్మిక, పౌరాణిక కారణాలు ఏమిటి? విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా గణపతికి ఈ ప్రత్యేక స్థానం ఎలా లభించిందో తెలుసుకుందాం.

నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు: నేడు 22A నిషేధిత భూములపై చర్చ

తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు నాలుగో రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. నేటి సమావేశాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని సెక్షన్ 22ఆ అంశంపై ఉభయ సభల్లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘమైన, వాడీవేడి చర్చ జరగనుంది.

శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు: రూ. 2 లక్షల ఉచిత బీమా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల సంక్షేమం దృష్ట్యా మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 2 లక్షల ఆరోగ్య/జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే.. ప్రమాదవశాత్తు జరిగే మరణాలకే కాకుండా, సహజ మరణాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది.