హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఛాంబర్‌లో మంగళవారం గౌరవ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్‌ను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని గిరిజనుల కోసం సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు గిరిజన భవనాల అవసరాన్ని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వెంటనే రెండు గిరిజన భవనాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, తమ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భవనాల ద్వారా గిరిజనులకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు.


