HomeWarangal Newsజనగామను ఆరోగ్య జనగామగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం - పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామను ఆరోగ్య జనగామగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం – పల్లా రాజేశ్వర్ రెడ్డి

Published on

spot_img

జనగామ | 25-01-2026

ఈ రోజు జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో జనగామ, జనగామ రూరల్, నర్మెట్ట, తరిగొప్పుల మరియు బచ్చన్నపేట మండలాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు రూ.15,32,500 విలువైన CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ,
“జనగామను ఆరోగ్య జనగామగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం” అని అన్నారు.

అదేవిధంగా ఆయన మాట్లాడుతూ—

గత రెండు సంవత్సరాలుగా నేను ఇచ్చిన మాట ప్రకారం నా స్వంత నిలం హాస్పిటల్‌లో నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నాను. రాబోయే మూడు సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగిస్తాను అని తెలిపారు.

మా హాస్పిటల్‌లో అందుబాటులో లేని ప్రత్యేక వైద్య సేవల కోసం నిమ్స్ (NIMS) లేదా ఇతర నిపుణ వైద్యులతో సమన్వయం చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పారు.

అత్యవసర పరిస్థితుల్లో అవసరమున్న వారికి LOC కూడా జారీ చేస్తున్నాం అని పేర్కొన్నారు.

ఇప్పటికే డబ్బులు ఖర్చు చేసి చికిత్స చేయించుకున్న పేదలందరికీ CMRF చెక్కులు త్వరితగతిన అందేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles