HomeWarangal Newsపరకాలలో వైద్య రంగానికి ఊతం.. 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి సన్నాహాలు

పరకాలలో వైద్య రంగానికి ఊతం.. 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి సన్నాహాలు

Published on

spot_img

పరకాలలో వైద్య రంగానికి ఊతం.. 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి సన్నాహాలు:

పరకాల పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో నూతనంగా నిర్మితమైన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య పరికరాలు, అవసరమైన మౌలిక వసతులతో వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు.

గురువారం నూతన ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో ఎమ్మెల్యే అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ఆర్డీవో వెంకన్న, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్ పవన్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా రూ.79.18 లక్షలతో వైద్య పరికరాల కొనుగోలు, అత్యవసర మందుల నిల్వలు, శస్త్రచికిత్సలకు అవసరమైన సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల కల్పనపై చర్చించారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్యుల సంఖ్య, రోగుల రద్దీ, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, మందుల నిల్వలు తదితర వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన బిల్లులు, రికార్డులను పరిశీలించిన ఆయన, వాటి నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించి సంబంధిత అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఆసుపత్రిలో 24 గంటలపాటు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా అనస్థీషియా వైద్యుడు అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు నిల్వ ఉంచాలని ఆదేశించారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles