పరకాల నియోజకవర్గం నుంచే తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని, ఇప్పుడు తన రాజకీయ ప్రయాణం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని సుస్మిత పటేల్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తప్పకుండా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని ఆమె అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ, పరకాల నియోజకవర్గం తమ కుటుంబానికి ప్రత్యేకమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె సుస్మిత పటేల్ ఇక్కడి నుంచే పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
సుస్మిత తనకంటే ధైర్యవంతురాలని, కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎంతటివారినైనా ఎదుర్కొనే సత్తా ఉందని కొండా మురళి అన్నారు.


