HomePoliticsపారాక్వాట్‌పై పూర్తి నిషేధం కోరిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య

పారాక్వాట్‌పై పూర్తి నిషేధం కోరిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య

Published on

spot_img

న్యూఢిల్లీ – పార్లమెంట్ | తేది:27-03-2026

గడ్డి మందు పర్యావరణం, ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం

ఆత్మహత్యలకు ఆయుధంగా మారిన పారాక్వాట్ ….. నిషేధమే దినికి పరిష్కారం

పారాక్వాట్‌తో రైతులు, ప్రజల ప్రాణాలకు ముప్పు

IMA సహా వైద్య వర్గాల నుంచి గడ్డి మందు నిషేధానికి బలమైన మద్దతు పెరిగింది

ప్రాణాంతక గడ్డి మందుపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలి ౼ లోక్‌సభలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోగ్య, పర్యావరణ ప్రమాదాలకు కారణమవుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) అనే అత్యంత ప్రమాదకర హర్బిసైడ్‌పై తక్షణమే పూర్తి నిషేధం విధించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో డిమాండ్ చేశారు.

శుక్రవారం పార్లమెంట్ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.

పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) వినియోగం వల్ల నేల, నీరు, ఇసుక తీవ్రంగా కాలుష్యం అవుతున్నాయని, దీని ప్రభావం వ్యవసాయ వ్యవస్థలపై తీవ్రమవుతోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు.

ఇది కేవలం పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రాణాంతక ముప్పుగా మారిందని హెచ్చరించారు.

అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే, ఈ రసాయనం గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలకు “మరణాయుధం”గా మారిందని ఎంపీ పేర్కొన్నారు.

పారాక్వాట్ సేవించిన సందర్భాల్లో దాదాపు 100 శాతం మరణాలు సంభవిస్తున్నాయని, దీనికి ఇప్పటివరకు సమర్థవంతమైన యాంటిడోట్ లేకపోవడం పరిస్థితిని మరింత విషమం చేస్తోందని అన్నారు.

తెలంగాణలోని వరంగల్ సహా పలు జిల్లాల్లో ఇది ఆత్మహత్యలకు సులభంగా అందుబాటులో ఉండే ప్రమాదకర సాధనంగా మారిందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులు, పర్యావరణం, సామాన్య ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు) తయారీ, విక్రయం, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తెలంగాణ సహా పలువురు వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు కూడా ఇదే అంశంపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ నిషేధం కోసం ఒత్తిడి తెస్తున్నారని ఎంపీ గుర్తుచేశారు.

ప్రమాదకర రసాయనాలకు బదులుగా సురక్షిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ డా.కడియం కావ్య కోరారు.

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొండా దంపతులకు జనసేనలో నో ఎంట్రీ? సుస్మితకు మాత్రమే గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీలను జనసేన పార్టీలోకి తీసుకోవద్దనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితకు మాత్రమే పార్టీలోకి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

బీసీ మంత్రిని బర్తరఫ్ చేయడం అన్యాయం: వేణుగోపాల్ గౌడ్

బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం తీవ్ర అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ పేర్కొన్నారు.