HomeWarangal Newsపరకాలను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం - ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి

పరకాలను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం – ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి

Published on

spot_img

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 6, 7, 8 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఉత్సాహకరమైన ప్రచారం నిర్వహించారు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు.

బుధవారం పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి గారితో కలిసి 6, 7, 8 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున పర్యటించి ప్రచారం చేశారు పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు.

పరకాల మున్సిపాలిటీ
Parkal Municipal Elections

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో ప్రజల మనసులను గెలుచుకుని, అభ్యర్థుల విజయానికి బలమైన ఆధారంగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పరకాల పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రజలు మెచ్చే నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

పరకాల పట్టణానికి దాని పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ఒక్కొక్క అంశంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రాజుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, పట్టణానికి కనీస సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

డీపీఆర్ (డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) వ్యవస్థ ద్వారా పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకుందామని, సీసీ రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని వివరించారు.

పరకాల మున్సిపాలిటీ
Revuri Prakash Reddy

ప్రతి ఒక్కరూ ఐక్యంగా, ఐకమత్యంగా పనిచేసి పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని, పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శిస్తూ, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

ప్రస్తుతం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం పంపిణీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles