HomeWarangal Newsబీఆర్ఎస్ పతనం మొదలైంది: బీజేపీ అభ్యర్థిని కొనుగోలు చేయడం సిగ్గుచేటు - డా. కాళీ ప్రసాద్...

బీఆర్ఎస్ పతనం మొదలైంది: బీజేపీ అభ్యర్థిని కొనుగోలు చేయడం సిగ్గుచేటు – డా. కాళీ ప్రసాద్ రావు

Published on

spot_img

పరకాలలో బుధవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేస్తున్న రాజకీయ తీరును తీవ్రంగా ఖండించారు బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు.

అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో ఇతర పార్టీల అభ్యర్థులను కొనుగోలు చేయడం, బెదిరింపులు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి దెబ్బతీసే చర్యలని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ పతనం మొదలైందని, ఇలాంటి నీచ రాజకీయాలతో ప్రజలు వారిని తిరస్కరిస్తారని హెచ్చరించారు.

మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఆర్థిక అహంకారంతో బీజేపీ అభ్యర్థిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు.

గతంలో బీఆర్ఎస్ ఇలాంటి రాజకీయాలు చేసినందుకు ప్రజలు గుణపాఠం చెప్పారని, మళ్లీ అదే తప్పు చేయడం హాస్యాస్పదమని అన్నారు.

బీజేపీ అభ్యర్థులు డబ్బుతో కాకుండా అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వస్తారని స్పష్టం చేశారు.

హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థిని బెదిరించి కొనుగోలు చేయడానికి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్యంపై దాడికి సమానమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ కాళీ ప్రసాద్ రావు మరింత తీవ్రంగా విమర్శిస్తూ, బీజేపీ అభ్యర్థిని బెదిరించి కొనుగోలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి పతనం తప్పదని, గతంలో బీఫారమ్‌లతో గెలిచిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ధర్మారెడ్డికి గుర్తున్నాయా అని ప్రశ్నించారు.

14వ వార్డులో జరిగిన ఘటన ఓటర్లను అవమానించే నీచ రాజకీయాలకు ఉదాహరణ అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవనూరి మేఘనాథ్, పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం, నడికుడ మండల అధ్యక్షుడు ఎరుకల దివాకర్, బాసాని సోమరాజు, చంద్రమౌళి, సల్పల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

AI 80’s ఫోటో ట్రెండ్‌పై నిపుణుల హెచ్చరిక.. ఫోటోలు అప్‌లోడ్ చేసే ముందు జాగ్రత్త!

AI టూల్స్‌తో 1980ల నాటి ఫోటోల తరహాలో చిత్రాలను మార్చుకునే ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వ్యక్తిగత ఫోటోలను AI ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేసే ముందు ప్రైవసీ, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బిగ్ బాస్ హోస్టుల రెమ్యునరేషన్.. ఒక్కో సీజన్‌కు కోట్లలో పారితోషికం!

బిగ్ బాస్ షోకు హోస్టులుగా వ్యవహరించిన ప్రముఖ నటులు, సెలబ్రిటీలకు భారీగా పారితోషికం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో సీజన్‌కు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ వివరాలు చూడాల్సిందే.

అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి ప్రశంసలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతలో భాగంగా కీలక కార్యక్రమం చేపట్టింది. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది బాలికలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

నిద్రలో పదేపదే మేల్కొంటున్నారా? మీ శరీరం చెప్తుందే ఇదే..!

రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడానికి ఒత్తిడి, ఆందోళన, కెఫిన్, గది వాతావరణం వంటి కారణాలు ఉండొచ్చు. అయితే గురకతో పాటు శ్వాస ఆగడం, పగటిపూట అధిక నిద్రమత్తు ఉంటే స్లీప్ అప్నియా సంకేతాలు కావచ్చు.
spot_img

Related Articles

వరంగల్‌లో మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చొరవతో ప్రమాదకర గుంతల పూడ్చివేత..

నగర పరిధిలోని ఫాతిమా బ్రిడ్జి, అదాలత్ సెంటర్ ప్రధాన రహదారులపై వాహనదారులకు నరకం చూపుతున్న ప్రమాదకర గుంతలను ట్రాఫిక్ సీఐ వెంకన్న తన సొంత చొరవతో పూడ్చివేయించారు.

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సడన్‌గా చెలరేగిన మంటలు: సకాలంలో స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించిన డెలివరీ బాయ్స్

విద్యుత్‌నగర్‌లోని రోడ్‌ నంబర్‌ 1 సమీపంలో ఒక భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. గురువారం రోజున అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.