HomeLatest News"నిరూపిస్తే ప్రాపర్టీ రాసిస్తా".. తెలంగాణ ప్రభుత్వానికి పవన్ ఓపెన్ సవాల్..!

“నిరూపిస్తే ప్రాపర్టీ రాసిస్తా”.. తెలంగాణ ప్రభుత్వానికి పవన్ ఓపెన్ సవాల్..!

Published on

spot_img

“నిరూపిస్తే ప్రాపర్టీ రాసిస్తా”.. తెలంగాణ ప్రభుత్వానికి పవన్ ఓపెన్ సవాల్..:

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజకీయంగా మాత్రం జనసేన పార్టీ చర్చనీయాంసంగా మారింది ప్రభుత్వం బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు:

ప్రెస్ మీట్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలి అని ఆకాంక్షించారు.

భూ కబ్జా ఆరోపణలపై స్పందన:

శంకర్‌పల్లి మండలం జన్వాడ పరిసరాల్లోని చెరువును పవన్ కళ్యాణ్ ఆక్రమించారంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన తొలిసారిగా స్పందించారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని కబ్జా చేశానని నిరూపిస్తే ఆ ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగిస్తానని ప్రకటించారు. “నిజంగా నేను చెరువును ఆక్రమించి ఉంటే ఇప్పటికే నా ఇంటిని తగలబెట్టేసే వాళ్ళు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. “చెరువు సమీపంలో తనకు ఉన్న భూమిలో గోశాల నిర్వహిస్తున్నానని.. అక్కడ 60 నుంచి 70 ఆవులు ఉన్నాయని.. ఆ పశువుల కోసం అవసరమైన గడ్డిని పెంచేందుకు ఆ స్థలాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ నేను భూమిని కబ్జా చేశానని నిరూపిస్తే ప్రభుత్వానికి ఉచితంగా రాయడానికి రెడీగా ఉన్నాను” అని తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

ప్రాంతీయ విద్వేషాలకు తావివ్వొద్దు:

ఈ సందర్భంగా ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రైవేటు ఆస్తుల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తనకు గౌరవం ఉందని చెబుతూ.. తనపై ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి అనే ముద్ర వేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నాలను సహించబోనని స్పష్టం చేశారు. తెలంగాణ అనేది అన్ని ప్రాంతాలు కులాలు, మతాలకు చెందిన ప్రజల సమిష్టి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని ఆయన అభిప్రాయపడ్డారు.

FAQ’s

1. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ ఏమిటి?

భూ కబ్జా నిరూపిస్తే తన ప్రాపర్టీ ప్రభుత్వానికి రాసిస్తానని ప్రకటించారు.

2. ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేశారు?

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశంలో చెప్పారు.

3. భూ వివాదంపై ఆయన ఏమన్నారు?

తాను చెరువు ఆక్రమించలేదని, గోశాల నిర్వహణ కోసం భూమి వినియోగిస్తున్నానని చెప్పారు.

4. ప్రాంతీయ రాజకీయాలపై ఆయన అభిప్రాయం ఏమిటి?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టకూడదని, తెలంగాణ సమిష్టి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని అన్నారు.

Read Warangal News and Latest Politics News and Real Estate

Latest articles

అమెరికాలో భారీ గణేష్ వేడుకలు వద్దు..NRIలకు కీలక సూచనలు!

అమెరికాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు కీలక సూచనలు వెలువడ్డాయి. బహిరంగ ప్రదేశాల్లో భారీగా వేడుకలు నిర్వహించకుండా ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని కమ్యూనిటీ పెద్దలు కోరుతున్నారు

అర్హత లేని టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం!

అర్హతలు లేని టీచర్ల నియామకాలు, కొనసాగింపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది

తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి? పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణలో ఈసారి దసరా సెలవులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఎన్ని రోజులు ఉంటాయి? పాఠశాలలకు సెలవుల తేదీలు, పునఃప్రారంభ తేదీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోండి.

నందు సడెన్ ఎంట్రీ వెనుక పెద్ద స్కెచ్? బిగ్‌బాస్ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ నిజమేనా..?

నందు సడెన్‌గా ఇండియాకు రావడం, హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వెంటనే పోలీసుల అదుపులోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అసలు ఆమె ఎంట్రీ వెనుక ఏదైనా స్కెచ్ ఉందా? బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం నిజమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.
spot_img

Related Articles