జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న నిరంజన్ అనే బాలుడి చివరి కోరిక మేరకు, అతడిని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇటీవల ‘తెలంగాణ స్థానికత’ వివాదం నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న జనసేన, ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానించేందుకు త్వరలోనే ‘జైనింగ్స్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
Read Warangal News and Latest Politics News and Real Estate


