HomeWarangal Newsదసరా ఉత్సవాలకు శాశ్వత వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దసరా ఉత్సవాలకు శాశ్వత వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Published on

spot_img

హనుమకొండ: హనుమకొండలోని ప్రముఖ సిద్ధేశ్వర పద్మాక్షి హనుమద్గిరి ప్రాంగణంలో ప్రతిఏటా నిర్వహించే దసరా ఉత్సవాలకు శాశ్వత వేదిక నిర్మించేందుకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

​విజయదశమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 33 ఏళ్లుగా ఇక్కడ రావణవధ, దసరా వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నప్పటికీ, శాశ్వత వేదిక లేక నిర్వాహకులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాబోయే దసరా పండుగ నాటికే ఈ పనులన్నింటినీ పూర్తి చేసి, వేదికను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఇంకా చదవండి: ఎమ్మెల్యే నాయిని క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఎమ్మెల్యే నాయిని క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ— ప్రజల సౌకర్యార్థం ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధి చేపడుతున్నామని, ఈ శాశ్వత వేదిక నిర్మాణమే దానికి నిదర్శనమని అన్నారు. ఈ నిర్మాణ పనులు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు సమన్వయంతో సహకరించాలని కోరారు.

​ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షులు చీకటి ప్రకాష్, కనుకుంట్ల రవికుమార్, సభ్యులు తోట పవన్, పులి రజనీకాంత్, పుర ప్రముఖులు గందె కృష్ణ, పిండి విజయకుమార్, మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లుతో పాటు వేముల శ్రీనివాస్, జక్కుల రవీందర్ యాదవ్, పోతుల శ్రీమాన్, పుప్పాల ప్రభాకర్, బోడో డిన్న, నసీం జహాన్, కానుగంటి శేఖర్, చీకటి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి: శివశక్తి మహంకాళి బోనాల జాతర: అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles