వాహనదారులకు ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. దేశంలో మరోసారి ఇంధన సెగ ప్రారంభమైంది. వారం రోజుల్లో వరుసగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్ళీ భగ్గుమనడంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి.
మంగళవారం నాడు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు సుమారు దాదాపు 90 పైసలు పెంచారు. గత శుక్రవారం లీటర్ కు మూడు రూపాయలు పెంచిన సంస్థలు.. ఇప్పుడు వారం తిరగకుండా ఏకంగా దాన్ని 90 పైసలకు పైగా పెంచేశారు.
వారం కూడా తిరగకముందే ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ పై 87 పైసలు పెరిగి అది 98.64 రూపాయలకు చేరింది.
ఇక డీజిల్ పై ఏకంగా 91 పైసలు పెరిగి 91.58 రూపాయలకు చేరింది. ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి :
నగరంతాజా ధర (రూపాయలు/లీటరు)పెరిగిన ధర (పైసల్లో)ఢిల్లీరూ. 98.64+87 పైసలు
కోల్‌కతారూ. 109.70+96 పైసలు
ముంబైరూ. 107.59+91 పైసలు
(చెన్నై)రూ. 104.49+82 పైసలు
ఇలా పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ప్రధాన కారణాలు దేశీయంగా ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరగడానికి అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిస్థితులే ప్రధాన కారణం అంటున్నారు ప్రముఖులు.
పశ్చిమాసియా ప్రాంతంలో ప్రస్తుత్తం ఎలాంటి పరిస్ధితి కొనసాగుతుందో మన అందరికి తెలిసిందే. ఈ సుదీర్ఘ సంఘర్షణల కారణంగా చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న అస్థిరత వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అమెరికా. యుద్ధం నేపథ్యంలో రకరకాల ఆంక్షలు సడలించింది. ఈ కారణంగా మే 17వ తేదీ వరకు రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించింది.
అయితే అమెరికా విధించిన గడువు ఆదివారం ముగియడంతో.. మళ్లీ కథ మొదటికి వచ్చినట్లు తెలుస్తుంది. అమెరికా ఆంక్షలు కారణంగా భారత – రష్యా నుంచి ఆయిల్ దిగుమతి నిలిపివేస్తే తీవ్రత పరిణామాలు తప్పవు.
ఆయిల్ సంక్షేమంతో అల్లాడుతున్న ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


