పెట్రోల్ బంకుల్లో వినియోగదారుల హక్కులు తెలుసా..? సమస్యలపై వెంటనే ఫిర్యాదు చేయండి :
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు అందాల్సిన కనీస సౌకర్యాలు సేవల విషయంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా మంచి తాగునీరు లేకపోవడం, వాహనాలకు గాలి నింపే సదుపాయం అందుబాటులో లేకపోవడం , టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం వంటి సమస్యలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు మౌనం పాటించకుండా తమ హక్కులను తెలుసుకొని ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్ బంకులలో తాగునీరు, ఉచిత గాలి సదుపాయం. పరిశుభ్రమైన టాయిలెట్ వంటి ప్రాథమిక సేవలు తప్పనిసరిగా ఉండాలి.

అదే విధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లల్లో అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంచాలి. కానీ కొన్నిచోట్ల ఈ నిబంధనలను పాటించకుండా వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక పెట్రోల్ , డీజిల్ కల్తీ చేయడం.. కొలతల్లో తేడాలు చూపించడం వంటి ఆరోపణలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ఇలా జరిగితే వాహనాల ఇంజన్లకు నష్టం కలగడంతో పాటు వినియోగదారులకు ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది సిబ్బంది వినియోగదారులతో దురుసుగా ప్రవర్తించడం కూడా అసంతృప్తికి కారణమవుతుంది. ఇలాంటి సందర్భాలలో సంబంధిత సరఫరా సంస్థలకు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని చాలా తక్కువ మందికే తెలుసు. సమస్య తీవ్రతను బట్టి వినియోగదారులు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
ఫిర్యాదుల కోసం సంప్రదించవలసిన నంబర్లు:
ఇండియన్ ఆయిల్ – 1800 233 3555
భారత్ పెట్రోలియం – 1800 22 4344
హెచ్పిసిఎల్ – 1800 233 3555
రిలయన్స్ – 1800 891 9023
అత్యవసర సేవల కోసం 1967, 1100, 1915, 112 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను కూడా సంప్రదించవచ్చు.
“వినియోగదారుడే రాజు” అనే నినాదం నిజం కావాలంటే ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకుని తప్పులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.


