ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే (PhonePe) తన వినియోగదారుల కోసం కొత్తగా ఫిక్స్డ్ డిపాజిట్ (FD), డైలీ రికరింగ్ డిపాజిట్ (RD) ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు నేరుగా యాప్‌లోనే తమకు కావలసిన సంబంధిత బ్యాంకులను ఎంపిక చేసుకుని ఎఫ్డీ (FD) ఖాతాను ప్రారంభించవచ్చు. అలాగే, రోజువారీ పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు ₹100 నుండి ₹1,000 వరకు పెట్టుబడి పెట్టేలా డైలీ రికరింగ్ డిపాజిట్ (Daily RD) స్కీమ్‌ను కూడా పరిచయం చేసింది.
యాప్‌లోని ‘మ్యూచువల్ ఫండ్స్ & డిపాజిట్’ (Mutual Funds & Deposit) విభాగంలో ‘ఫిక్స్డ్ డిపాజిట్స్ or డైలీ RD’ ఫీచర్ కనిపిస్తుందని ఫోన్‌పే ప్రతినిధులు తెలిపారు. ఈ ఆప్షన్ ఉపయోగించి యూజర్లు తమకు నచ్చిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, కాలపరిమితిని (టెన్యూర్) సులభంగా ఎంచుకోవచ్చని సంస్థ స్పష్టం చేసింది.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


