ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం మే 10న ఉమ్మడి జిల్లాలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్క్, మరియు మామునూరు ఎయిర్పోర్ట్ పనులకు భూమిపూజ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ప్రధాని రాకపై సందిగ్ధం నెలకొంది.
గ్రేటర్ ఎన్నికల ఊహాగానాలు జోరందుకోవడంతో, రాజకీయ కారణాల దృష్ట్యా ప్రధాని పర్యటన రద్దు కావొచ్చని సమాచారం. ఈ క్రమంలో కీలక ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలను హైదరాబాద్ నుంచే వర్చువల్ (ఆన్లైన్) పద్ధతిలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాకు రావాల్సిన ప్రధాన ప్రాజెక్టుల వేడుకలు ఆన్లైన్ ద్వారానే సాగే సూచనలు కనిపిస్తున్నాయి.


