HomeLatest Newsబిగ్ బ్రేకింగ్: అల్లు అర్జున్ మామ పై పోలీస్ కేసు..!

బిగ్ బ్రేకింగ్: అల్లు అర్జున్ మామ పై పోలీస్ కేసు..!

Published on

spot_img

బిగ్ బ్రేకింగ్: అల్లు అర్జున్ మామ పై పోలీస్ కేసు :

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని నానక్‌రామ్‌గూడలో చోటుచేసుకున్న భూవివాదం మరో మలుపు తిరిగింది. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మంత్రి కాస్మోస్ గేటెడ్ కమ్యూనిటీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసులో మురళీధర్ రెడ్డి, గడ్డం రవిని కూడా నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది.

గేటు తాళాలు పగులగొట్టి చొరబాటు? :

అసోసియేషన్ ఫిర్యాదు ప్రకారం.. చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు మంత్రి కాస్మోస్ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపణలు ఉన్నాయి. గేటుకు ఉన్న తాళాలను ధ్వంసం చేసి, అక్కడి నిర్మాణాలకు నష్టం కలిగించడంతో పాటు తమకు చెందిన స్థలంగా పేర్కొంటూ టిన్‌షీట్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సెక్యూరిటీ సిబ్బందికి బెదిరింపులు :

ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులను నిందితులు బెదిరించినట్లు ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. అడ్డువచ్చిన వారిని తోసివేయడంతో పాటు, తమ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపింది.

సీసీటీవీ ఫుటేజీల పరిశీలన :

ఫిర్యాదును స్వీకరించిన గచ్చిబౌలి పోలీసులు అక్రమ ప్రవేశం, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు తదితర ఆరోపణలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.