స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందింది. ఆ ప్రాంత విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేస్తూ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
కొత్త సబ్ స్టేషన్ మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలియజేశారు. సాగరం, కొండాపూర్, కూర్పల్లి సబ్ స్టేషన్ల పనులను వేగవంతం చేసి, మార్చి లోపు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
మిగతా సబ్ స్టేషన్ల టెండర్ ప్రక్రియలో గానీ, స్థల కేటాయింపులో గానీ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎండీ వరుణ్ రెడ్డితో పాటు ఇతర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా మెరుగుపరచడమే మా లక్ష్యం. పెండింగ్‌లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు కడియం శ్రీహరి.


