HomeWarangal Newsవరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు కొత్త చైర్‌పర్సన్ ప్రియాంక.. వైస్ చైర్మన్ జనార్ధన్ బాధ్యతలు స్వీకరణ

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు కొత్త చైర్‌పర్సన్ ప్రియాంక.. వైస్ చైర్మన్ జనార్ధన్ బాధ్యతలు స్వీకరణ

Published on

spot_img

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు కొత్త సారథి.. బాధ్యతలు చేపట్టిన ప్రియాంక:

వరంగల్‌లోని ప్రముఖ వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలకవర్గాన్ని నియమించింది. చైర్‌పర్సన్‌గా ప్రియాంక, వైస్ చైర్మన్‌గా జనార్ధన్ బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం ద్వారా రైతులకు మెరుగైన సేవలు, మార్కెట్ అభివృద్ధి, పారదర్శక పరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

అంశంవివరాలు
మార్కెట్ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
చైర్‌పర్సన్ప్రియాంక
వైస్ చైర్మన్జనార్ధన్
కార్యదర్శిశ్రీనివాస్
ప్రాంతంవరంగల్
మార్కెట్ రకంవ్యవసాయ మార్కెట్

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నూతన ఉన్నతశ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ నియామితులైయ్యారు. రైతులు, వ్యాపారులు మరియు మార్కెట్ కి సంబంధించిన వర్గాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ నియామకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..”రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ కమిటీలను మరింత సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో పాలకవర్గాల నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు”.

ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 191 వ్యవసాయం మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించినట్లు ఆయన వెల్లడించారు. కొత్తగా నియమితులైన చైర్ పర్సన్ ప్రియాంక, వైస్ చైర్ పర్సన్ జనార్ధన్ కు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. వారి నాయకత్వంలో ఎనుమాముల మార్కెట్ మరింత అభివృద్ధి చెందడంతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రముఖ వ్యవసాయ మార్కెట్లో ఒక్కటైన ఎనుమాముల మార్కెట్ కు కొత్త పాలకవర్గం నియామకం కావడం వల్ల మార్కెట్ నిర్వహణ, రైతులకు అందే సౌకర్యాలు, వ్యాపార కార్యకలాపాల విస్తరణకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

FAQ’s

ఎనుమాముల మార్కెట్ చైర్‌పర్సన్ ఎవరు?

ప్రియాంకను తెలంగాణ ప్రభుత్వం చైర్‌పర్సన్‌గా నియమించింది.

వైస్ చైర్మన్ ఎవరు?

జనార్ధన్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఎనుమాముల మార్కెట్ ఎక్కడ ఉంది?

హనుమకొండ సమీపంలోని వరంగల్‌లో ఉంది.

ఎనుమాముల మార్కెట్ ఎందుకు ప్రసిద్ధి?

తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఇది ఒకటి.

Read Warangal news and latest politics news and Real estate 

Latest articles

పిల్లలకు ఫోన్ అలవాటు మాన్పించాలా? తల్లిదండ్రులు ఇలా చేయండి!

పిల్లలకు ఫోన్ అలవాటు ఎక్కువైందా? స్క్రీన్ టైమ్‌ను క్రమంగా తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయంగా ఆటలు, పుస్తకాలు, కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచేందుకు తల్లిదండ్రులు పాటించాల్సిన సింపుల్ టిప్స్ ఇవే.

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...