HomeWarangal Newsహనుమకొండ: ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

హనుమకొండ: ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Published on

spot_img

తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడైన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ, యువ నాయకుడు విష్ణు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Prof Jayashanker

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. ప్రాంతం, వర్గం, కులం, మత భేదాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసి తెలంగాణ ఆకాంక్షను ఉద్యమంగా మలిచిన గొప్ప దార్శనికుడు జయశంకర్ అని కొనియాడారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, స్వయం పాలన, సమాన అభివృద్ధి కోసం ఆయన దశాబ్దాల పాటు చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. జయశంకర్ చూపిన మార్గంలోనే రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

Prof Kothapalli Jayashanker

ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్యా మరియు ఉపాధి రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. జయశంకర్ కలలు కన్న సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలను స్మరించుకుని, ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, మాధవి రెడ్డి, బంక సరళ సంపత్, అంకుస్, నాగరాజు, రాజ్ కుమార్, సారంగం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

కేయు అధ్యాపకుడు డా. ఎల్. జితేందర్‌కు జాతీయ స్థాయి డిజైన్ పేటెంట్

పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎల్. జితేందర్ ప్రతిష్టాత్మక గుర్తింపును సాధించారు.

ఇంజనీర్ల సేవలు దేశ అభివృద్ధికి కీలకం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

దేశ అభివృద్ధిలో ఇంజనీర్ల సేవలు అత్యంత కీలకమైనవని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

టీజీఎన్పీడీసీఎల్‌కు రెండు జాతీయ పురస్కారాలు

హనుమకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. నక్కలగుట్టలోని సంస్థ...