తెలుగు రాష్ట్రాలు:
తెలుగు రాష్ట్రాల్లోని ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు అలర్ట్. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈరోజు (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచే పోలియో చుక్కల పంపిణీ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు అన్ని ప్రాంతాల్లోని పోలియో బూత్‌లలో ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుంది.
మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారా?
ఇంకా వేయించకపోతే… ఆలస్యం చేయొద్దు!
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజే పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఉదయం 7 గంటల నుంచే చుక్కల మందు పంపిణీ ప్రారంభం కానుంది.
ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 లక్షల మందికి పైగా ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. భవిష్యత్తు తరాలను పోలియో మహమ్మారి బారి నుంచి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు చుక్కల మందు వేయించాలని వైద్య ఆరోగ్యశాఖ కోరింది.
మర్చిపోవద్దు.. ఒకవేళ ఈరోజు కుదరకపోతే:
ఈరోజు ఏదైనా కారణం చేత పోలియో బూత్‌లకు రాలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల 29, 30 తేదీల్లో ఆరోగ్య సిబ్బంది నేరుగా మీ ఇంటికే వచ్చి, మిగిలిపోయిన చిన్నారులకు పోలియో చుక్కల మందు వేస్తారని అధికారులు స్పష్టం చేశారు.
ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా సమీపంలోని పోలియో కేంద్రానికి వెళ్లి ఈరోజే వ్యాక్సిన్ వేయించండి.
FAQ’s
1. పల్స్ పోలియో ఈరోజు ఎప్పుడు?
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు.
2. ఎవరికి పోలియో చుక్కలు వేయాలి?
ఐదేళ్లలోపు పిల్లలందరికీ.
3. ఈరోజు వెళ్లలేకపోతే?
జూన్ 29, 30న ఇంటికే వచ్చి వేస్తారు.
4. పోలియో ఇంకా ప్రమాదమా?
అవును, పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేయాలి.
Read Warangal News and Latest Politics News and Real Estate

