HomeLatest Newsఉచిత ప్రయాణంపై రైల్వే బోర్డు కఠిన నిర్ణయం.. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు నిరాశ..!

ఉచిత ప్రయాణంపై రైల్వే బోర్డు కఠిన నిర్ణయం.. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు నిరాశ..!

Published on

spot_img

ఉచిత ప్రయాణంపై రైల్వే బోర్డు కఠిన నిర్ణయం.. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు నిరాశ :

హైదరాబాద్ నగర పరిధిలో నడిచే ఎంఎంటిఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం) రైల్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రైల్వే బోర్డు తిరస్కారం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే అధికారులు లేక ద్వార తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

రైల్వే శాఖ ఇప్పటికే ఎంఎంటిఎస్ సేవల నిర్వహణలో భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటుందని అధికారులు పేర్కొన్నారు. గత ఏడాదిలోనే ఎంఎంటిఎస్ కార్యకలాపాల వల్ల సుమారు 160 కోట్ల మేర నష్టం వాటిని వెల్లడించారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 490 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు.

జూన్ 2వ తేదీ నుంచి ఎంఎంటిఎస్ రైళ్లల్లో ప్రయాణికులకు ఉచిత ప్రయాణం కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో రైల్వే బోర్డు దీనిపై సమగ్రంగా పరిశీలన చేపట్టింది. అయితే ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్న సేవలకు మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

అయితే ఉచిత ప్రయాణ పథకం అమలుతో ఏర్పడే మొత్తం ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని స్పష్టమైన హామీ ఇస్తే ప్రతిపాదనను పునర్విమర్శించేందుకు సిద్ధంగా ఉన్నామని రైల్వే బోర్డ్ పేర్కొంది. ఈ పరిణామంతో ఎంఎంటిఎస్ ఉచిత ప్రయాణ ప్రతిపాదన అమలుపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Latest articles

బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్స్ తింటే కడుపు నిండుగా.. ఆరోగ్యం పదిలం!

ఉదయం అల్పాహారం రోజంతా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల్యమైన ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఎక్కువసేపు ఎనర్జీగా ఉండొచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

IIT JAM 2027: ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సులకు ప్రవేశాలు..!

IIT JAM 2027 ద్వారా దేశంలోని ఐఐటీలు, ఐఐఎస్సీలో పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. అర్హత, దరఖాస్తు తేదీలు, పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి
spot_img

Related Articles

నవోదయ సీటు మీ లక్ష్యమా? ప్రిపరేషన్ ఇలా ఉంటే సక్సెస్ పక్కా!

నవోదయ ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సాధించాలంటే ముందుగా సిలబస్, పరీక్ష విధానాన్ని అర్థం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదవాలి. రోజువారీ ప్రాక్టీస్, మాక్ టెస్టులు, టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడితే పరీక్షకు మెరుగ్గా సిద్ధం కావచ్చు.

ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు.. రూ.2 వేల దాటితే 0.4% ఫీజు!

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు విధించనున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం వరకు ఫీజు ఉండొచ్చనే సమాచారం వినిపిస్తోంది.

SSC CGL 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

SSC CGL 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. CGL 2026 టైర్-1 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష తేదీలు, ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.