HomeWarangal Newsరైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించిన కడియం కావ్య

రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించిన కడియం కావ్య

Published on

spot_img

హనుమకొండ: కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను పరిశీలించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

స్థానికులకు అన్యాయం జరగకుండా చూస్తాం

భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

యూనిట్ లో వివిధ సర్వీస్ లలో స్థానికులకే ఉద్యోగ అవకశాలు కల్పించాలి

గతంలోను కేంద్ర రైల్వే మంత్రిని కలిసి భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరను

భూ బాధితులకు, స్థానికులకు ఉద్యోగాలపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తా

మార్చి నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో పనులు ప్రారంభం

ఏడాదికి 600 కోచ్ లు ఇక్కడ తయారవుతాయి ౼వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య

కాజీపేటలోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను స్థానిక శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారితో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో జరుగుతున్న పనుల పురోగతి, మౌలిక వసతుల అభివృద్ధి, విభాగాల వారీగా జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలపై రైల్వే అధికారులతో ఎంపీ డాక్టర్ కడియం కావ్య సమీక్షించ నిర్వహించారు.

Meeting
Kadiyam Kavya

ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య గారు మాట్లాడుతూ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ 30 ఏళ్ల కల నెరవేరబోతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలొనే ఇది సాధ్యమైందని, ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. భూములు కోల్పోయిన వారికి అన్యాయం జరగకుండా చూస్తామని అన్నారు. భూ బాధితులతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. గతంలో ఇదే అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి కోరనని వెల్లడించారు. రైల్వే యూనిట్ లో స్థానికుల ఉద్యోగాలు కల్పించే అంశంపై పార్లమెంట్ లో సైతం తన గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మార్చి నెలలో ప్రారంభమవుతుందని అన్నారు. ప్రతి ఏడాది 600 ల కోచ్ లను ఇక్కడ సిద్ధం చేస్తారని పేర్కొన్నారు. ఏక్కడ పనులు జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు ఎంపీ సూచించారు. అనంతరం రైల్వే అధికారులు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నమూనా వివరాలను ఎంపీకి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో CME ఆనంద్, GGM మురళీకృష్ణ, DGM శర్మ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles