రైల్వే శాఖ ప్రయాణికుల కోసం టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త రిఫండ్ రూల్స్ ఇవే:
• ప్రయాణానికి 72 గంటల కంటే ముందుగా టికెట్ రద్దు చేసుకుంటే, కేవలం నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించి పూర్తి మొత్తం (Full Refund) తిరిగి చెల్లిస్తారు.
• 72 నుండి 24 గంటల లోపు రద్దు చేసుకుంటే 25 శాతం ఛార్జీలు కట్ అవుతాయి.
• ప్రయాణానికి ఒక రోజు నుండి 8 గంటల ముందు వరకు రద్దు చేసుకుంటే 50 శాతం నగదు కోత విధిస్తారు.
• రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ లభించదు.
ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15 మధ్యలో అమల్లోకి రానున్నాయి. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను బట్టి ముందస్తుగానే నిర్ణయం తీసుకోవడం మంచిది.


