HomeLatest Newsజాతీయ వార్తలు: రాజస్థాన్ లో నీట్ (NEET-UG) 2026 పేపర్ లీక్ కలకలం

జాతీయ వార్తలు: రాజస్థాన్ లో నీట్ (NEET-UG) 2026 పేపర్ లీక్ కలకలం

Published on

spot_img

సికార్/జైపూర్: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్-యూజీ 2026’ ప్రవేశపరీక్ష వివాదంలో చిక్కుకుంది. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

పరీక్షకు ముందే కొంతమందికి పంపిణీ చేసిన మెటీరియల్‌లోని ప్రశ్నలు, అసలు పరీక్షా పత్రంలోని ప్రశ్నలతో సరిపోలినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 600 మార్కులకు సరిపడా ప్రశ్నలు ముందే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

 ఈ లీకైన మెటీరియల్‌ను ఒక్కో అభ్యర్థికి రూ. 20 వేల నుంచి రూ. 2 లక్షల వరకు విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేరళకు చెందిన ఒక MBBS విద్యార్థి ద్వారా ఈ సమాచారం బయటకు పొక్కినట్లు సమాచారం.

 ఈ భారీ నెట్‌వర్క్ వెనుక ఎవరూ ఉన్నారనే కోణంలో పోలీసులు మరియు విచారణాధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు.

ఈ లీక్ వ్యవహారంపై స్పష్టత రావాల్సి ఉండటంతో, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.